Wednesday, 10 August 2016

Mangala Gauri Puja Procedure, Mangala Gouri Vratha Vidhanam




మంగళగౌరి వ్రతము
పార్వతిదేవికి మరో పేరు మంగళ గౌరి. శ్రావణ మాసంలో వచ్చే నాలుగు మంగళవారాలు మంగళగౌరి అయిన పార్వతీదేవిని పూజించాలి. మంగళ గౌరీ ఎక్కడ ఉంటుందో తెలుసా ... పసువు , కుంకుమ , పూలు , సగుంధాది మంళ ద్రవ్యాలలోను , ఆవు నేతితో ప్రకాశించే జ్యోతిలోనూ కొలువై ఉంటుంది .మంగళగౌరి వ్రతము ఈ మాసం లో ఆచరించడం ఎంతో ప్రాసస్థ్యమైనవి. మంగళగౌరి కటాక్షం ఏ స్త్రీల పై ఉంటుందో వారికి వైధవ్య బాధ ఉండదు. సర్వవిధ సౌభాగ్యాలతో వారు వర్దిల్లుతారు. కొత్తగా పెళై్ళన వారు తప్పక ఐదు సంవత్సరాలు ఈ వ్రతాన్ని ఆచరించడం ఆనవాయితీ. అలాగే కొన్ని ప్రాంతాల వారు ఈ వ్రతాన్ని పెళ్లి కాని పిల్లల చేత కూడా చేయిస్తారు. పెళ్లి కి ముందు నాలుగు సంవత్సరాలు చేయించి పెళై్ళన తర్వాత మిగిలిన ఒక సంవత్సరం ఈ వ్రతాన్ని నోచుకొంటారు.
పూర్వం కృతయుగంలో దేవతలు రాక్షసులు కలిసి అమృతం కోసం క్షీరసాగరమధనం చేసే సమయాన అమృతానికి ముందు అగ్నిజ్వాలలు కక్కుతూ కాలకూట విషయం పుట్టుకొచ్చింది. దానిని చూసి భయకంపితులైన దేవదానవులు పరమేశ్వరుని శరణుజొచ్చారు. ఆ సమయాన పరమేశ్వరుడు మందహాసముతో పార్వతి వైపు చూచాడు. ఆ సర్వమంగళ స్వరూపిణియై జగన్మాత, భర్తచూపులోని ఆంతర్యమేమిటో గ్రహించింది. దేవతులైనా, దానవులైనా, మానవులైనా, మనభక్తులే కదా! మన బిడ్డలకు ఆపద కలిగినప్పుడు మనము కాక వేరెవరు రక్షిస్తారు? అని భావించి నిరంతరం స్త్రీల సౌభాగ్య సంపదను కాపాడే ఆ సర్వమంగళ స్వరూపిణి తన మాంగల్య సౌభాగ్యముపై ప్రగాఢ విశ్వాసముంచి, లోకవినాశానికి కారణభూతమైన ఆ భయంకర కాలకూట విషాన్ని తన భర్త మింగేందుకు అనుమతి ఇచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. అట్టి కరుణాంతరమూర్తి పార్వతీదేవి. అట్టి సర్వమంగళ స్వరపిణి అయిన భవానీ మాతను కొత్తగా పెళ్లైన స్త్రీలు శ్రావణమాసం తొలిమంగళవారంతో మంగళగౌరీ వ్రతాన్ని విధిగా ప్రారంభించి ఐదు సంవత్సరాలు దీక్షగా ఆచరించాలి. అలా ఈ వ్రతాన్ని చేపట్టిన స్త్రీలపై శ్రీ మంగళగౌరి కటాక్షముతో వైధవ్యబాధలు లేకుండా వారీ జీవితాంతం సర్వసౌఖ్యములతో గడుపుతారని పెద్దలు చెబుతారు.
మంగళగౌరి వ్రత కథ
మొదట శౌనకాది మహర్షులకు మంగళగౌరీ మహాత్యాన్ని సూతులవారు వివరించారు .
నారదమహర్షి ఈ వ్రత మహత్యాన్ని సావిత్రీదేవికి ఉపదేశించారు ,
శ్రీకృష్ణుడు వ్రత విధాన్ని, వ్రత మహాత్యాన్ని ద్రౌపదికి వివరించాడు .
పూర్వం జయపాలుడనే రాజు మహిష్మతీ నగరాన్ని పాలించేవాడు . భోగభాగ్యాలు ఎన్ని ఉంటే నేం ఆయనకు సంతానము కలుగలేదు . ఆ దంపతులకు అదే దిగులు. ఎన్ని నోములు నోచి, ఎన్ని దానాలు చేసిన పిమ్మట చివరికి పరమేశ్వరునికి ఆ దంపతులపై కరుణ కలిగినది. పరమశ్వరుడు ఓ సన్యాసి రూపములో జయపాలుని నగరానికి వచ్చి అంత:పురము బయట ద్వారము వద్ద నిలబడి " భవతీ భిక్షాందేహి " అనేసి అక్కడనుండి వెళ్ళిపోయాడు . జయపాలుని భార్య భిక్ష వేసేందుకు వచ్చేలోపలే ఆ సన్యాసి వెళ్లిపోయాడు. ఇలా మూడు రోజులు జరిగింది. జరిగినదంతా భర్తకు వివరించింది. రేపు ఆ సన్యాసి వచ్చేముందే నీవు సిద్ధంగా ఉండమని భర్ర్యతో చెప్పాడా రాజు.
మరుసటిరోజు సన్యాసి రావడం మహారాణి బంగారు పళ్ళెంతో సహా భిక్ష వేయబోవడం జరిగింది. ఆ సన్యాసి ఆ భిక్షను స్వీకరించక... సంతానము లేని నీచేతిభిక్ష నేను స్వీకరించనని పలికేసరికి... అయితే మహాత్మా ! సంతానము కలిగే మార్గాన్ని ఉపదేశించండి" అని వేడుకోగా ... ఆ సన్యాసి రూపములో ఉన్న పరమేశ్వరుడు " అమ్మా నేను చెప్పబోయేది నీ భర్తకు తెలియజేయి. నీల వస్త్రాలను ధరించి, నీలం రంగు అశ్వాన్ని అధిరోహించి, ఒంటరిగా నీ భర్తను నగరం తూర్పు దిక్కుకు వెళ్ళమను. అక్కడ అరణ్యంలో అతని నీలాశ్వం ఎక్కడ అలసటతో ఆగుతుందో అక్కడ దిగి నేలను త్రవ్వమను. ఆ త్రవ్వకము నుండి ఒక స్వర్ణదేవాలయం బయట పడుతుంది . ఆ స్వర్ణదేవాలయంలో ఉన్న అమ్మవారిని శ్రద్ధా భక్తులతో పూజిస్తే ఆమె మీకు సంతానాన్ని ఇస్తుంది ". అని చెప్పి వెళ్ళిపోయాడు సన్యాసి రూపియైన శివుడు. ఈ విషయంతా భర్తకు చెప్పి ఆవిధంగా చేయసాగేరు. స్వర్ణదేవాలయంలో ఉన్న అమ్మవారిని జయపాలుడు ప్రార్ధించాడు. జయపాలుని భక్తికి మెచ్చి ధనాన్నిస్తాను కోరుకోమంది అమ్మవారు. నాకు ధనము వద్దు సంతానము కావాలని అన్నాడు జయపాలుడు... అప్పుడు అమ్మవారు " వైధవ్యము గల కన్య కావలెనా? అల్పాయుష్మంతుడు, సజ్జనుడు అయిన కుమారుడు కావాలా? కోరుకోమని అడిగింది అమ్మవారు". అప్పుడు రాజు పిత్రుదేవతల్ను ఉద్ధరించేందుకు కుమారుడే కావాలని కోరుకున్నాడు. అమ్మవారు పక్కనే ఉన్న చూతవృక్షాన్ని చూపి దాని ఫలాన్ని ఒకటి తీసుకుని నీ భార్యకు ఇవ్వు అని అంతర్ధానమయ్యెను. జయపాలుడు ఆ వృక్షానికున్న పండ్లన్నీకోసేసరికి గణపతికి కోపము వచ్చింది . " ఇందుకు ఫలితంగా నీకు జన్మించే కుమారుడు పదహారవ ఏట సర్పం బారినపడి మరణిస్తాడని " శపిస్తాడు .
కొన్నాళ్ళకు జయపాలుని భార్య ఒక కుమారుని కన్నది. ఆ కుర్రవాడికి వయసొచ్చింది. వివాహము జరిగితే కుమారుడికి ఆయుస్సు పెరుగుతుందేమోనని భావించి కుమారుడికి వివాహము చేద్దాం అని భర్త తో అన్నది . కాశీవిశ్వెశ్వరుడుని దర్శించి వచ్చాక వివాహము చేదాం అని చెప్పి తన కుమారుని అతని మేనమామతో కాశీకి పంపించారు . మార్గమధ్యలో వారు పతిస్టానపురం చేరారు . అక్కడ వారిద్దరూ ఓ సత్రంలోకి ప్రవేశించారు . అక్కడ కొందరు కన్యలు ఆడుకొంటున్నారు . వారిలో సుశీల అనే కన్య మరొక కన్యతో గొడవపడగా ఆ కన్య సుశీలను "ముండ" అంటూ కోపం తో దుర్భాషలాడింది . అప్పుడు సుశీల " మా అమ్మగారు మంగళగౌరీ వ్రతము చేస్తుంది " కాబట్టి మాకుటుంబము లో ఎవరూ ముండలు - ఉండరు అంది కోపంతో. జయపాలుడు కుమారుడు శివుడు అతని మేనమామ ఇదంతా జరిగేటప్పుడు అక్కడే ఉన్నారు. తన మేనల్లుడు అల్పాయుష్కుడు అన్న సంగతి అతనికి తెలుసు. " మా ఇంట్లో ముండలు ఎవరు ఉండరు. మా అమ్మ శ్రావణ మంగళ గౌరీవ్రతం చేస్తుంటుంది." అన్న సుశీల మాట వినేసరికి శివుడి మేనమామకు ఓ ఉపాయము తోస్తుంది. సుశీలను శివుడి కిచ్చి వివాహము జరిపిస్తే అతనికి తప్పకుండా మంగళ గౌరీదేవి అనుగ్రహం లభించి పరిపూర్ణ ఆయుష్కుడు అవుతాడని భావిస్తాడు. మేనల్లుడు శివునితో సహా శివుని మేనమామ .. ధ్యానము లో ఉన్న సుశీల తల్లిదండ్రుల దగ్గరగా చేరి శివుడనే బాలుడు నీకూతురుకి తగిన భర్త అని దేవుని వాక్యముగా చాటుగా అంటాడు . దాంతో సుశీల .. శివుడుల వివాహము జరిగిఫోతుంది .
పెళ్ళయిన ఆ కొత్త దంపతులు ఆ రాత్రి బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తారు . మంగళగౌరీదేవి ముత్తైదువు రూపములో సుశీలకు కలలో కనబడి " నీ భర్త అల్ఫాయుష్కుడు ఈ రాత్రితో ఆతని ఆయువు చెల్లింది. ఈ దోషము నకు మార్గము చెపుతాను విను " అని ఈవిధంగా చెప్పెను . " కొద్ది సేపట్లో ఒక కృష్ణ సర్పము నీ భర్తను కరవడానికి వస్తుంది. వెంటనే నీవు నిండా పాలు ఉన్న ఓ కుండను దాని ముందు ఉంచు అప్పుడు పాము ఆ కుండలోకి పవేశించాక వస్త్రముతో ఆ కుండ మూతిని గట్టిగా కట్టి ఉదయాన్నే దాన్ని నీ తల్లికి వాయనమివ్వు ". దాంతో నీ భర్తకా గండము తప్పిపోతుంది " అని అంతర్ధానమయ్యెను . శివుడు తన మేనమామతో కాశీ యాత్ర పూర్తిచేసుకొని తిరుగు ప్రయాణములొ భార్య సుశీలను తన ఇంటికి తీసుకొని వెళ్తాడు . విషయము తెలుసుకొందామని శివుడు.. సుశీలను తన ఆయువు ఎలా? పెరిగినదని అడుగగ " అంతా శ్రావణ మంగళ గౌరీ్వ్రతం ప్రభావమని చెప్పినది . ఈ విదముగా శ్రికృష్నుడు ఈ కథను ద్రౌపది కి చెప్పెను .

Mangala Gowri Vrata/Puja is observed/performed during the Tuesdays in the month of Shravana and also referred to as Shravana Mangala Gowri  Puja.

Mangala Gowri Puja is dedicated to Goddess Gowri or Parvati and done with the intention that Goddess Gowri will bless the house with auspiciousness,  material prosperity, health and long life. This vrata  is mentioned in the Bhavishyoththara Purana / Hindu religious texts and is traditionally performed by women for the first five years of their married life. It is also observed by married women desiring  the good health and long lives of their spouses and for the welfare of their families.


No comments:

Post a Comment