కుడి, ఎడమ కళ్లు అదిరితే ఏం జరుగుతుంది..!
కొత్త పనులు మొదలుపెట్టేప్పుడు, ఏదైనా ఒక విషయంపై తర్జన బర్జనలు చేస్తున్న వేళ శకునాలను చూడటం పరిపాటి. అలాగే మేలు జరిగినా, కీడు జరిగినా కళ్లు అదరడం ద్వారా ముందుగా పసిగట్టవచ్చునని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. మన ప్రాచీన శాస్త్రం ప్రకారం.. పురుషునికి కుడికన్ను, స్త్రీకి ఎడమ కన్ను అదిరితే శుభం, లాభం చేకూరతాయి. పురుషునికి ఎడమకన్ను, స్త్రీకి కుడి కన్ను అదిరితే కీడు-ఆపదలు వస్తాయని పండితులు చెబుతున్నారు. రెండు కళ్లు ఒకేమారు అదిరితే స్త్రీ పురుషుల కిరువురికి శుభసూచకము. మన సాంప్రదాయ శకున శాస్త్రంలో కూడా ఈ విషయాలు పొందుపరచబడి ఉన్నాయి.పురాణాల ప్రకారం.. సీతాదేవిని రావణాసురుడు అపహరించే ముందు ఆమెకు కుడికన్ను, లక్ష్మణుడికి ఎడమకన్ను అదిరాయట. రావణ సంహారానికి ముందు రాముడు లంకలోకి ప్రవేశించగానే రావణుడికి ఎడమకన్ను, సీతకి ఎడమకన్ను అదిరాయట. ఆ కాలం నుంచే కన్ను ఆదరటం వలన జరిగే శుభ, అశుభ శకునాలను అంచనా వేసేవారు. ఇలా నమ్మకాల ప్రకారం పురాతన కాలం నుంచి కన్ను అదిరితే ఏదో అవుతుందనుకోవడం తెలిసిందే..
ఆరోగ్య కారణాలు:
కళ్ళు అదరడం శకునంగా అయితే ఒక లిప్త కాలంగా జరుగుతుంది. కానీ గంటల తరబడి కన్ను అదరడం అనారోగ్యానికి సూచిక. నిద్ర సరిగ్గా పోకపోయినా, నరాల బలహీనత, విటమిన్ల లోపం, కొన్ని రకాల కంటి సంబంధమైన రోగాల వల్ల కూడా కన్ను అదరటం జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు…
ఇంకా ఎక్కడెక్కడ అదిరితే ఏమవుతుందంటే..
* కింది పెదవి భాగం అదిరితే భోజనసౌఖ్యము, గడ్డం అదిరితే లాభం జరుగుతుందట. ఇతరుల ద్వారా సహాయ సహకారాలు లభిస్తాయట. కుడిచెక్కిలి ధనప్రాప్తి, ఎడమచెక్కిలి-చోరబాధలు, కుడి భుజములదిరితే భోగసంపదలు వంటి ఫలితాలుంటాయి.
* ఎడమ భుజము అదిరితే కీడు, కష్టములు, రొమ్ము అదిరితే ధనలాభం, ధైర్యం వస్తాయి. అరచేయి అదిరిన సంతాన ప్రాప్తి, గౌరవం కలుగుతుందని పండితులు అంటున్నారు.
As everybody says if left eye blinks it is bad men and good for women and if right eye blinks it is good for men and bad for women but if you see their is always down and up trends in life if something going to happen wrong or bad then good will also happen don't worry and just leave everything up to god if you believe me.
Magnesium deficiency buddy, eat more foods rich in this wonderful little mineral. i.e., leafy and green veggies, nuts and seeds, whole grains and cereals, cold water fishes such as tuna, salmon, sardines and whiting.
Magnesium is essential for effective nerve and muscle functioning. When our bodies are deficient it will simply be leached from our bones and muscles, hence the twitching you are experiencing, magnesium is known as the anti-stress mineral and will also aid in fighting depression, promote a healthier cardiovascular system and help prevent heart attacks, keep teeth healthier, bring relief from indigestion and combined with calcium can work as a natural tranquilizer.
No comments:
Post a Comment